రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.. కేటీఆర్ సంచలన ట్వీట్
BRS వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) మరోసారి సంచలన ట్వీట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: BRS వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) మరోసారి సంచలన ట్వీట్ చేశారు. శనివారం రాత్రి జన్వాడలోని ఓ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిని ఉదేశించి బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం(congress Govt) కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ ట్వీట్లో "రెండు రోజులుగా జరుగుతుంది కేవలం ఆరంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘త్వరలో మనపై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తాం. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ మనల్ని టార్గెట్ చేస్తాయి. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు. వాటిని మీ దృష్టి మరల్చనివ్వవద్దు’ అని కేటీఆర్(KTR) తన ట్వీట్లో రాసుకొచ్చారు.