ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గద్దర్ పాత్ర కీలకం:Kasani Gnaneshwar
సమసమాజ స్థాపనకోసం పోరాడిన వ్యక్తి గద్దర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థిక దేహానికి పూలమాలవేసి ఆయన
దిశ, తెలంగాణ బ్యూరో: సమసమాజ స్థాపనకోసం పోరాడిన వ్యక్తి గద్దర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థిక దేహానికి పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. పీడిత వర్గాలు చైతన్య వంతులుగా అవడానికి కాలికి గజ్జెకట్టి, భుజాన గొంగడితో యావత్తు ప్రజానికాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన గొంతుతో ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గద్దర్ పాత్ర కీలకం అన్నారు. పేద ప్రజల హక్కుల సాధనకు చివరి శ్వాస వరకు పోరాడిన గద్దరన్న మరణం ఆ వర్గాలకు తీరని లోటు అన్నారు.
తెలంగాణ ప్రజల గోస, యాస, ధిక్కార అస్తిత్వాన్ని తన వాణితో ప్రస్ఫుటంగా ప్రపంచానికి వినిపించిన విప్లవ కారుడు గద్దర్ అని కొనియాడారు. గద్దర్‌ను కోల్పోవడం ఆయన ఒక్క కుటుంబానికే కాదు సమస్త తెలంగాణ సమాజం ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా దుఃఖంతో ఉందన్నారు. గద్దరన్న జీవితం ప్రజాస్వామిక వాదులకు, అట్టడుగు వర్గాల ఆకాంక్షల సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు హాబీబ్ మహమ్మద్, నల్గొండ పార్లమెంటు అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.