టీచర్ ఎమ్మెల్సీకి నాలుగు నామినేషన్లు దాఖలు
మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి నామినేషన్లు కొనసాగుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి నామినేషన్లు కొనసాగుతున్నాయి. మంగళవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయినేని సంతోష్ కుమార్, వెంకట్ నారాయణ రెడ్డి అయ్యాలపు, బి. వినయ్ బాబు, కాసం ప్రభాకర్ ఒక్కొక్కరు ఒక్కొక్క సెట్‌తో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రియాంకకు అందజేశారు. మరో నలుగురు బి. భుజంగరావు, దేవన్నగిరి మల్లారెడ్డి, పాపన్న గారి మాణిక్ రెడ్డి, మారంపల్లి లక్ష్మీనారాయణ మరో సెట్ నామినేషన్లను దాఖలు చేశారు. హైదరాబాద్ లోకల్ అథారటీ ఎన్నికకు నాలుగో రోజు కూడా ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రియాంక తెలిపారు.