దశాబ్ది ఉత్సవాల వేళ సొంత గూటికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దిశ, మేడ్చల్ టౌన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన అనుచరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు బయలుదేరారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చాపరాజు, శ్రీనివాస్ రెడ్డి, రేగురాజు, నిషిత రెడ్డి, పోచయ్య తదితరులు ఉన్నారు. కాగా, రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాహుల్ గాంధీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీలో ఇన్ని కొనసాగినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత కొంతకాలంగా ఏ పార్టీలో చేరకుండా సైలెంట్‌గా ఉన్నారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.