KCRisMISSING: కేసీఆర్ మిస్సింగ్! తెలిస్తే అసెంబ్లీకి తెలియజేయండి ట్విట్టర్‌లో వైరల్

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేతకు అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరింది.

Update: 2024-02-13 08:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేతకు అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరింది. కృష్ణ జలాల సమస్యపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వివరణ ఇవ్వాలని, మేడిగడ్డ సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ స్వీకరించలేదు. ఐదు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన గులాబీ బాస్ అసెంబ్లీకి రాలేదు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ మిస్సింగ్, ఎవరికైనా తెలిస్తే అసెంబ్లీకి ఇన్ఫర్‌మెషన్ ఇవ్వాలని అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

#KCRisMISSING హ్యాష్ ట్యాగ్‌

#KCRisMISSING హ్యాష్ ట్యాగ్‌తో కాంగ్రెస్ శ్రేణులు ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నాయి. ‘కేసీఆర్ ఎక్కడ? తెలంగాణకు రావాల్సిన 225.4 టీఎంసీలు క్లెయిమ్ చేయకుండా ఏపీ సీఎం జగన్ స్నేహం కోసం తెలంగాణ ను తీవ్రంగా అన్యాయం చేశావు’ అని కాంగ్రెస్ శ్రేణులు పోస్ట్ చేస్తున్నాయి. ‘ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రశ్నించే నిలయం శాసనసభ అలాంటి సభకు రాకుండా సొంత పార్టీ మీటింగ్ లకు,సమావేశాలు పెట్టుకొనే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించడం లేదు’ అని నెట్టింట్లో కేసీఆర్ ఫోటో పెట్టి కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు పెట్టాయి. అయితే మేడిగడ్డ ప్రాజెక్టును ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సందర్శిస్తున్న వేళ ఒక్కసారిగా కేసీఆర్ మిస్సింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, కృష్ణా జలాలపై పోరుకు నల్గొండ సభకు ఆయన ఇవాళ నిరసన సభ ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News