KTR : అసెంబ్లీ చరిత్రలో తొలిసారి : కేటీఆర్ మండిపాటు
అసెంబ్లీ(Assembly)లో పరిమితుల విధింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మండి పడ్డారు.
దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ(Assembly)లో పరిమితుల విధింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మండి పడ్డారు. అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులను శాసనసభవైపు రాకుండా చేసిన తీరుపై విరచుకు పడ్డారు. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో ఇదే శాసనసభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాలు వంటి వాటితో పాటు అనేక రకాల అంశాలను తీసుకొచ్చి నిరసన తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. శాసనసభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేసి తమ వైఫల్యాలను దాచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చూస్తోందని కేటీఆర్ అన్నారు. మీడియా వద్ద కూడా శాసన సభ్యులను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళ్తే కాసేపు ఆపారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు బయటకొచ్చిన అంశంపై మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. తమ వైఫల్యాలను దాచిపెట్టేందుకే ప్రభుత్వం ఇవన్ని ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.