దహెగాం ప్రభుత్వ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. వారం తర్వాత వెలుగులోకి ఘటన

ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-07-09 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం దహెగాం ప్రభుత్వ స్కూల్‌లో చోటు చేసుకుంది. కాగా ఘటన పోయిన గురువారం చోటు చేసుకుంది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. స్కూలుకు వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని సాయంత్రం ఇంటికి వెళ్ళాక వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో తమ పిల్లలను తల్లిదండ్రులు భైంసాలోని పలు ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వారం నుంచి ఆస్పత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతుండగా.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు కట్టలేక కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఏరియా హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తుంది. వీరిలో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News