ఐదుగురు యువకుల ఆత్మహత్యాయత్నం కలకలం

మాకు తీరని అన్యాయం జరుగుతుంది అంటూ ప్రభుత్వ ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు యువకులు హాస్పిటల్ భవంతి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

Update: 2024-07-02 05:48 GMT

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : మాకు తీరని అన్యాయం జరుగుతుంది అంటూ ప్రభుత్వ ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు యువకులు హాస్పిటల్ భవంతి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే భుక్య జయకృష్ణ, నాగబాబు, సీతారాం, శంకర్రావు, సరిలాల్ అనే ఐదుగురు యువకులు గత రెండు సంవత్సరాలుగా అవుట్‌సోర్సింగ్ విధానంలో పేషెంట్ కేర్‌గా పని చేస్తున్నారు. తమని ఉన్నపలంగా తాము పనిచేస్తున్న సహారా ఏజెన్సీ సెక్యూరిటీ గార్డ్‌గా విధులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల రూ.16,800 నెల జీతానికి గాను కేవలం రూ.11వేలు మాత్రమే అకౌంట్లో వేస్తున్నారని, ఈఎస్ఐ, పీఎఫ్ రూ.2వేలు మినహాయించిన మరో మూడు వేల ఎనిమిది వందలు ప్రతి నెల నష్టపోతున్నామని అంటున్నారు. పోలీసుల రంగ ప్రవేశం, సహారా ఏజెన్సీ హామీతో ఈ వ్యవహారం సద్దుమణిగింది.


Similar News