Health Minister: డాక్టర్ల సమస్యలన్నీ పరిష్కారిస్తాం
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏళ్ల తరబడి పెండింగ్‌లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, త్వరలోనే మిగతా సమస్యలన్నింటికి చెక్ పెడతామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా(Minister Damodara Raja Narasimha) పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏళ్ల తరబడి పెండింగ్‌లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, త్వరలోనే మిగతా సమస్యలన్నింటికి చెక్ పెడతామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా(Minister Damodara Raja Narasimha) పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(Telangana Doctors Association) మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ రవూఫ్, కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ డాక్టర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్, టీవీవీపీ పరిధిలోని సమస్యలన్నీ ఒక నివేదిక తరహాలో తయారు చేయాలని మంత్రి డాక్టర్లకు సూచించారు. వాటిపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు దీన్ దయాల్, కృష్ణారావు, కళ్యాణ్, రాజు, రామ్ సింగ్, రమేష్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.