ఓవర్​ స్పీడ్​ తో ప్రయాణం... కేసీఆర్​ బస్సుకు ఫైన్​

సీఎం కేసీఆర్​ ప్రయాణం చేసిన జేసీబీఎల్​ బస్సుకు ట్రాఫిక్​ పోలీసులు జరిమానా వేశారు. గత నెల 2

Update: 2022-09-09 14:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​ ప్రయాణం చేసిన జేసీబీఎల్​ బస్సుకు ట్రాఫిక్​ పోలీసులు జరిమానా వేశారు. గత నెల 20న నల్గొండ జిల్లా మునుగోడు సభకు భారీ కాన్వాయితో హైదరాబాద్​ నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సభకు సీఎం కేసీఆర్​ హరితహారం ప్రారంభం కోసం, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ప్రచార సభకు వినియోగిస్తే జేసీబీఎల్​ కంపెనీకి చెందిన బస్సులో వెళ్లారు.



"మనస్వప్నం –మన ధ్యేయం.. బంగారు తెలంగాణ రాష్ట్రం అనే నినాదాలతో ఉన్న టీఎస్​ 07 z 6666 అనే నెంబర్​ తో ఉన్న ఈ ప్రభుత్వ బస్సు ఓవర్​ స్పీడ్​ తో వెళ్తోంది. సీఎం కాన్వాయి ఓవర్​ స్పీడ్​ తో ఉన్నా వాటిని వదిలేసిన రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని వనస్థలిపురం ట్రాఫిక్​ పోలీసులు.. సీఎం కేసీఆర్​ ప్రయాణం చేస్తున్న ఈ బస్సుకు వెయ్యి ఫైన్​ వేశారు. మొత్తం యూజర్​ చార్జీలతో కలుపుకుని రూ. 1035 చెల్లించాలని నోటీసులిచ్చారు. అయితే, జరిమానా వేసిన అంశాన్ని తాజాగా తెలంగాణ స్టేట్​ పోలీస్​ ఈ చలాన్​ సిస్టంలో అప్​లోడ్​ చేశారు. ఈ నెల 20న ఓవర్​ స్పీడ్​ కారణంగా RAC94IT225707550 ఈ చలాన్​ నెంబర్​ ను సైతం వెల్లడించారు.




 



Similar News