రాహుల్ గాంధీ పాదయాత్రకు రూట్ మ్యాప్ ఖారారు
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రకు రాష్ట్రంలో రూట్ మ్యా
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రకు రాష్ట్రంలో రూట్ మ్యాప్ ఖరారైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 2న ఈ యాత్ర ప్రారంభం కానుండగా.. అదే నెలాఖరులో రాష్ట్రానికి రానున్నారు. దీని కోసం తెలంగాణలో రూట్ మ్యాప్ ఖరారైంది. నారాయణపేట జిల్లా మక్తల్ వద్ద కర్ణాటక నుంచి రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.
మక్తల్, కొడంగల్, పరిగి, వికారాబాద్, జుక్కల్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 150 రోజులపాటు 3,600 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 2న మొదలయ్యే రాహుల్ యాత్ర అదే నెలలో రాష్ట్రానికి రానుంది. ఇదే సమయంలో మునుగోడు ఉపఎన్నికకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో రాహుల్ యాత్ర కొంతమేరకైనా కలిసి వస్తుందనే ఆశలు పెట్టుకుంటున్నారు.