రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్ మార్పులు
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు(Metro Rail) రెండో దశ డీపీఆర్(DPR)కు తుది మెరుగులు దిద్దుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు(Metro Rail) రెండో దశ డీపీఆర్(DPR)కు తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇటీవల జరిపిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సైతం దీనికి ఆమోదం తెలిపారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. అంతేకాదు.. ఈ రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు అందుబాటులోకి రానుందని మెట్రో అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మరోవైపు.. ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆరాంఘర్-బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో లైనును ఫైనల్ చేసింది.
కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్టు కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలో మెట్రో మార్గం వెళ్లనుంది. రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫోర్త్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే కేంద్ర అనుమతుల కోసం మెట్రో రెండో దశ డీపీఆర్‌లు పంపించారు. ఇప్పటికే మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తోంది. రెండో దశ కూడా పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గం ఉండనుంది.