తహసీల్దార్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం

తహసీల్దార్ నాగమణి కావాలని తమ భూమిని ధరణి నుంచి తొలగించిందంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు చోటుచేసుకుంది.

Update: 2024-06-26 07:06 GMT

దిశ, శంషాబాద్ : తహసీల్దార్ నాగమణి కావాలని తమ భూమిని ధరణి నుంచి తొలగించిందంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు చోటుచేసుకుంది. శంషాబాద్ గ్రామానికి చెందిన రైతులు చెన్నకేశ కమలమ్మ, చెన్నకేష్ లక్ష్మయ్య భార్యాభర్తలపై ఘాన్సిమియగూడ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 4/7.4/8 లో ఇద్దరికీ ఎనిమిది ఎకరాల పట్టాభూమి ఉంది ఈ భూమిని 1977 సంవత్సరంలో కొనుగోలు చేశామన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కూడా ధరణిలో మాపై భూమి ఉంది.

అయితే గత నవంబర్ 6వ తేదీన ధరణి పోర్టల్ నుండి శంషాబాద్ తహసీల్దార్ నాగమణి మా పట్టా భూమిని తొలగించిందంటూ అప్పటినుండి 9 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ధరణి పోర్టల్‌లో ఎంట్రీ చేసి తమకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తిరిగిన పట్టించుకోలేదంటూ తిరుగుతూనే ఉన్నామని ఈరోజు, రేపు అంటూ కాలయాపన చేసిందని బుధవారం తహసీల్దారు కార్యాలయం రైతు చెన్నకేశవ కమలమ్మ వారి కొడుకులు సూరిబాబు చంద్రశేఖర్ ఆందోళన చేస్తుండగానే పోలీసులు ప్రయత్నం చేయడంతో సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే వచ్చి నీళ్లు పోయడంతో సద్దుమణిగింది అయినా తమకు న్యాయం చేయాలంటూ కార్యాలయం ముందు ఆందోళన దిగారు.

తహసీల్దార్ నాగమణి వివరణ..

శంకరపురం గ్రామానికి చెందిన చెన్నకేశవ కమలమ్మ, చెన్నకేశవ లక్ష్మయ్య వారి పేరు మీద ఘాన్సిమియ గూడలో వారికి పట్టా పొలం ముందు అది ధరణిలో నుంచి డిలీట్ కావడంతో తిరిగి అప్లికేషన్ తీసుకోవడం జరిగిందని, పబ్లికేషన్ పరిశీలనలో ఉందని, ధరణిలో వారి భూమి డిలీట్ కావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. పరిశీలన పూర్తి అవ్వగానే చూస్తామన్నారు.


Similar News