Jagga Reddy: ట్రోల్ చేసేవాళ్లు దొరికితే.. బట్టలూడదీసి కొడతా.. జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

తనపై ట్రోలింగ్ చేస్తున్న వాళ్లు దొరికితే.. బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-10-26 07:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: తనపై ట్రోలింగ్ చేస్తున్న వాళ్లు దొరికితే.. బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్య కొంతమంది సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడిన మాటలను వక్రీకరించి దష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సీఎం (CM)తో సహా, మంత్రుల (Ministers)పైనా సోషల్ మీడియా (Social Media) ముసుగులో కొందరు కాంగ్రెస్ (Congress) వ్యతిరేకులు తప్పుడు పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

తమ నాయకులు మాట్లాడిన ప్రసంగాలను సైతం ఇష్టానుసారంగా ఎడిట్ చేసి సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొట్టేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్చర్యకంగా తాను లేడీ కలెక్టర్‌ (Lady Collector)ను బూతులు తట్టినట్లుగా పోస్టులు పెట్టారని జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. ఇక నుంచి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోనని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా (BRS Social Media) దండుపాళ్యం బ్యాచ్‌లా మారిందని ఆరోపించారు. ఒకవేళ ట్రోలింగ్ చేస్తున్న వాళ్లు తన చేతికి దొరికితే బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) నాయకులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao)కు ఈ మధ్య మతి భ్రమించిందని అన్నారు. అధకారం దూరం అవ్వడంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. నిత్యం ఏదో విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

Read More : ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయాం.. జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు


Similar News