Aasara Pensions: తాడో పేడో తేల్చుకుంటాం.. రేవంత్ సర్కారుకు మందకృష్ణ మాదిగ హెచ్చరిక

చేయూత పింఛన్ (Aasara Pensions) దారులందరినీ వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) వెల్లడించారు. చేయూత పింఛన్ దారులందరితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఆయన తెలిపారు.

Update: 2024-10-26 08:20 GMT

దిశ, వెబ్ డెస్క్: చేయూత పింఛన్ దారులను రేవంత్ సర్కార్ (CM Revanth Reddy) నట్టేట ముంచిందని విమర్శించారు మందకృష్ణ మాదిగ. చేయూత పింఛన్ (Aasara Pensions) దారులందరినీ వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) వెల్లడించారు. చేయూత పింఛన్ దారులందరితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి.. ఆ పార్టీని గెలిపించారని, కానీ ఇప్పుడు నమ్మిన పింఛన్ దారుల్ని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకూ పింఛన్లను ఎందుకు పెంచలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంటే.. ఏపీ సీఎం చంద్రబాబే చాలా బెటర్ అన్నారు మందకృష్ణ. ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చామని, జూన్ లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. ఏప్రిల్, మే, జూన్ నెలలవి కలిపి జూలైలో ఇచ్చారని తెలిపారు. అలాగే కండరాల క్షీణత ఉన్నవారికి ప్రతినెలా రూ.15 వేలు పింఛన్ ఇస్తున్నారని చెప్పారు.

వచ్చేనెల మొదటివారంలో తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పింఛన్ దారులకు 10 నెలల బకాయిలను కలిపి ఇవ్వకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నవంబర్ 1 నుంచి 16వ తేదీ వరకూ రోజుకు రెండు జిల్లాల్లో చేయూత పింఛన్ లబ్ధిదారులతో చైతన్య సభలు నిర్వహిస్తామని, అప్పటిలేగా పింఛన్లు ఇవ్వని నేపథ్యంలో 26న చలో హైదరాబాద్ (Chalo Hyderabad)కు పిలుపునిస్తామన్నారు. అదే రోజున వికలాంగుల మహాగర్జన పేరుతో ఇందిరాపార్క్ (Indirapark) వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. 

Tags:    

Similar News