రాష్ట్రంలో భారీగా పెరిగిన చలి తీవ్రత.. గజ్జున వణుకుతున్న ప్రజలు
శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికి తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.
దిశ, వెబ్ డెస్క్: శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికి తెలంగాణ(Telangana) రాష్ట్రంలో చలి తీవ్రత(Cold intensity) రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది. కానీ ఈ సంవత్సరం పండుగ ప్రారంభంలోనే చలి తీవ్రత అధికంగా మారింది. ముఖ్యంగా చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా నేడు తెలంగాణలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు(Minimum level Temperatures) నమోదయ్యాయి. ఇందులో మరీ ముఖ్యంగా మెదక్ జిల్లాలో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే గజ్జున వణుకుతున్నారు. అలాగే మహానగరం హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై దూరప్రాంతాలకు డ్యూటీ కి వెళ్లే వారు.. బైకులను వదిలి మెట్రో బాట పడుతున్నారు. ఇదిలా ఉంటే పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు అలర్ట్ జారీ చేస్తున్నారు. వయస్సు మీదపడిన వారు, శ్వాస సంబందిత వ్యాదులతో బాదపడుతున్న వారు బయటకు రాకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
వివిధ ప్రాంతాలలో నమోదైన చలి తీవ్రత
* మెదక్ జిల్లాలో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* రాజేంద్రనగర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత
* పటాన్‌చెరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత,
* హకీంపేట్‌లో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రత
* ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత
* నిజామాబాద్‌లో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత,
*దుండిగల్‌లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత
*హైదరాబాద్‌లో 15.9 డిగ్రీల ఉష్ణోగ్రత,
*హన్మకొండలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి