ED Investigation: ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అక్కర్లేదనుకున్నారా..? బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం!
ఫార్ములా-ఈ కారు రేసు (Formula E-Car Race) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering), ఫెమా నిబంధనలను (FEMA Regulations) ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఇవాళ ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు.
దిశ, వెబ్డెస్క్: ఫార్ములా-ఈ కారు రేసు (Formula E-Car Race) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering), ఫెమా నిబంధనలను (FEMA Regulations) ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఇవాళ ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేసు 2 అగ్రిమెంట్ జరిగిన సమయంలో డబ్బు బదిలీలో బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలోనే బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. రూ.10 కోట్ల నిధులకు సంబంధించి ఫైల్ మూవ్ చేసేప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ (Finance Department) నుంచి పర్మిషన్ అక్కర్లేదా.. అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
హెచ్ఎండీఏ (HMDA)లో కీలక అధికారి అయి ఉండి నిధుల విషయంలో ప్రతి దఫా అనుమతి తీసుకోవాలనే విషయం కూడా తెలియదా అని అడిననట్లుగా సమాచారం. అదేవిధంగా కేబినెట్ (Cabinet) అనుమతి లేకుండా నిధులు ఎలా అడిగారని మీరు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించ లేదా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఫైల్ ఎందుకు మూవ్ చేశారనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుమతి లేకుండా నిధులు ట్రాన్స్ఫర్ చేస్తే HMDAపై భారం పడుతుందని తెలియదా.. అని బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా సమాచారం.