TG High Court: మరికొద్ది గంటల్లో ఏసీబీ విచారణకు కేటీఆర్.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case)లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case)లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు. ఈ మేరకు ధర్మాసనం ఆయన పిటిషన్‌ను స్వీకరించింది. రేపు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఆయన వేసిన లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition)పై హైకోర్టు (High Court) ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ (ACB) నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 6న కేటీఆర్ బంజారా హిల్స్‌లోని ఏసీబీ కార్యాలయనికి విచారణకు వెళ్లారు. ఆ సమయంలో విచారణలో భాగంగా తన వెంట లాయర్‌ను అనుమతించకపోవడంపై కేటీఆర్ (KTR) తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఏసీబీ అడిషనల్ ఎస్పీ (ACB Additional SP)తో వాగ్వాదానికి దిగారు. తన వెంట లాయర్‌ను అనుమతిస్తేనే విచారణకు వస్తానని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా, క్వాష్ పిటిషన్ (Quash Petition)ను హైకోర్టు (High Court) డిస్మస్ చేయడం, మరికొద్ది గంటల్లో ఏసీబీ విచారణ (ACB Investigation)కు హాజరుకానున్న తరుణంలో కేటీఆర్ ఏసీబీ విచారణకు తన వెంట లాయర్ అనుమతించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) హయాంలో హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగిన ఫార్ములా ఈ-కారు రేస్ (Formula E-Car Race) నిర్వహణలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. అయితే, కేసులో అప్పట్లో మునిసిపల్ శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్ (KTR) పేరును అధికారులు A1గా చేర్చారు.