Bandi: అబద్దాలు, విధ్వంసకారుల పార్టీగా కాంగ్రెస్.. కేంద్రమంత్రి సంచలన ట్వీట్
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(AICC) మొత్తం అబద్దాలు ప్రచారం చేసే వాళ్లతో నిండిపోయిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) విమర్శించారు.
దిశ, వెబ్ డెస్క్: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(AICC) మొత్తం అబద్దాలు ప్రచారం చేసే వాళ్లతో నిండిపోయిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుప్రియా శ్రీనెట్(Supriya Srinet) ఓ మీడియా సంస్థతో మాట్లాడిన వీడియోను బండి సంజయ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆయన.. ఏఐసీసీ ఫేక్ న్యూస్(Fake News) పేడ్లర్లతో నిండిపోయిందని, తెలంగాణ మహిళలకు(Telangana Women) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నుంచి రూ.1 కూడా అందలేదని వ్యాఖ్యానించారు. అలాగే మహిళలకు సాధికారత కల్పించాల్సింది పోయి, వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇళ్లను కూల్చివేయడం, కూరగాయలు వ్యాపారులను రోడ్డున పడేయటం, గర్భిణులను బలవంతంగా వీధుల్లో నెట్టడం లాంటివి చేశారని మండిపడ్డారు.
ఇది పాలన కాదని, మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం అని ఆగ్రహించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో.. రేప్ కేసులు దారుణంగా 28.94 శాతం పెరిగాయని, మహిళలపై హత్యలు 13 శాతం, కిడ్నాప్‌లు, దొంగతనాలు 26 శాతం పెరిగాయని, కాంగ్రెస్ హామీ ఇచ్చిన భద్రత ఎక్కడ ఉందని నిలదీశారు. మహిళలపై దౌర్జన్యాలు 8 శాతం పెరిగాయని, వారి ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోందని అన్నారు. అలాగే కాంగ్రెస్ హయాంలో 10,000 మందికి పైగా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారని, మహిళా సాధికారత అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దోపిడిదారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారిందని, తెలంగాణ మహిళలు గౌరవం, భద్రత, మద్దతుకు అర్హులు అని, కన్నీళ్లు, భయాలు, ద్రోహాలకు కాదని చెప్పారు. ఇది భయకరమైన కాంగ్రెస్ నిజస్వరూపం అని, ప్రజల ఆగ్రహానికి తప్పక గురవుతారని బండి సంజయ్ రాసుకొచ్చారు.