Minister Komatireddi Venkatareddy : మేనిఫెస్టోలో లేకపోయినా మూసీ ప్రక్షాళన చేస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddi Venkatareddi) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddi Venkatareddi) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా తాము మూసీ(Musi) నది ప్రక్షాళన చేపడుతున్నామని అన్నారు. మూసీ నది మురికి వలన ఆ నది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు విషంగా మారాయని.. కాబట్టి మూసీని శుద్ధి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళన చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుందని ఓర్వలేక బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు ప్రక్షాళనకు అడ్డుపడుతన్నారని మండి పడ్డారు. మూసీ పరివాహక ప్రాంతాలు బాగు పాడకూడదా.. వారిని అలాగే ఖర్మకు వదిలేయాలా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే అప్పు చేసైన సరే మూసీని బాగు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు మూసీ ప్రాంతాల్లో నిద్రించి దానిని గొప్పగా చెప్పుకుంటున్నాయి కాని, సకల సదుపాయాలు ఏర్పాటు చేసుకొని బస చేసినట్టు బీజేపీ నేతలు డ్రామాలు ఆడారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.