టీఎస్ ఈసెట్, లాసెట్-2023 షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ ఈసెట్‌ -2023, లాసెట్ -2023 షెడ్యూల్ విడుద‌లైంది.

Update: 2023-02-27 12:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఈసెట్‌ -2023, లాసెట్ -2023 షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 1వ తేదీన టీఎస్‌ఈసెట్‌, లాసెట్, పీజీ ఎల్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఈ షెడ్యూల్‌ను సోమవారం తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీ డి ర‌వీందర్, ఈసెట్‌ క‌న్వీన‌ర్ శ్రీరాం వెంక‌టేశ్‌ క‌లిసి విడుద‌లచేశారు. మార్చి 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వ‌ర‌కు ఈసెట్ ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. రూ. 500 ఆల‌స్యం రుసుంతో మే 8వ తేదీ వ‌ర‌కు, రూ. 2,500తో మే 12వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు తమ ద‌ర‌ఖాస్తుల‌ను మే 8 నుంచి మే 12వ తేదీ వ‌ర‌కు ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

మే 15 నుంచి అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. మే 20న ఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. వివ‌రాల కోసం https://tsecet.nic.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు. ఇక, మార్చి 2 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులు స్వీకరించనున్నారు. ఓపెన్ కేట‌గిరి అభ్య‌ర్థులకు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ. 600గా ద‌ర‌ఖాస్తు ఫీజు నిర్ధారించారు. రూ. 500 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 12 వ‌ర‌కు, రూ. 1000తో ఏప్రిల్ 19 వ‌ర‌కు, రూ. 2 వేల‌తో ఏప్రిల్ 26 వ‌ర‌కు, రూ. 4 వేల‌తో మే 3వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించొచ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మే 25న టీఎస్ లాసెట్‌, టీఎస్ పీజీ ఎల్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు. వివ‌రాల కోసం https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

Tags:    

Similar News