Errolla Srinivas: స్టేట్ పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్

స్టేట్ పాలిటిక్స్‌ (State Politics)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-12-26 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ పాలిటిక్స్‌ (State Politics)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) నేత, రాష్ట్ర తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ (Errolla Srinivas) అరెస్ట్ అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ (Hyderabad)లోని వెస్ట్ మారేడ్‌పల్లి (West Marredpally)లో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి మాసబ్ ట్యాంక్ పీఎస్‌కు తీసుకున్నారు. కాగా, బంజారాహిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం ఆయనపై ఇటీవలే కేసు నమోదైంది. అదేవిధంగా ఇదే వ్యవహారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy)పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా, ఎర్రోళ్లను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం జరగడంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Tags:    

Similar News