1000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ

తెలంగాణ ప్రభుత్వం మరో 1000 ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభించింది.

Update: 2024-09-11 11:57 GMT

దిశ, వెబ్‌డెస్క్:  తెలంగాణ ప్రభుత్వం మరో 1000 ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(KGBV)ల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఉద్యోగాలకు గతం సంవత్సరం నిర్వహించిన రిక్రూట్మెంట్ టెస్ట్ మెరిట్ ఆధారంగా.. అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. కాగా కేజీబీవీల్లో ఇటీవల 450 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలు జరిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది.


Similar News