DSC Results: డీఎస్సీ ఫలితాల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Update: 2024-09-30 07:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) డీఎస్సీ-2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం జులై 18 నుంచి ఆగస్ట్ 5వ వరకు నిర్వహించిన డీఎస్సీ(DSC) పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేశామని పేర్కొన్నారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని అన్నారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియం (LB Stadium)లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ (బ్రష్) ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్కసారి 7 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించిందని గుర్తు చేశారు. కానీ, తాము అధికారంలోకి వచ్చిన కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలను విడుదల చేశామని అన్నారు. చెప్పినట్లుగానే టీజీపీఎస్‌సీని సమూలంగా ప్రక్షాళన చేశామని పేర్కొన్నారు. డీఎస్సీ మాదిరిగానే గ్రూప్-1 పరీక్షలను నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. కాగా, మొత్తం డీఎస్సీ పరీక్షకు 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం నిర్వహించారు.


Similar News