Drunken Woman : ‘అవును.. బరాబర్‌ నేను కోటర్‌ తాగిన’ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళ హల్‌చల్‌

'అవును.. బరాబర్‌ నేను కోటర్‌ తాగిన' అంటూ ఓ మహిళ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేసింది.

Update: 2024-12-02 08:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 'అవును.. బరాబర్‌ నేను కోటర్‌ తాగిన' అంటూ ఓ మహిళ (Uppal police station) ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన (Drunken Woman) మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. దీంతో ఆమెను (Breath Analyzer) బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారికి చుక్కలు చూపించింది. ‘కోటర్ తాగిన అని ఒప్పుకుంటున్నా.. ఇంకా ఎంతసేపు ఊదాలి' అంటూ పోలీసులను ప్రశ్నించింది. చాలా సమయం తర్వాత చివరకు ఆమెతో పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో టెస్ట్ పూర్తి చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హౌస్ కీపర్‌గా ఆ మహిళ పని చేస్తోంది. ఆమె మద్యం తాగిన మత్తులో కనిపించే వారితో గొడవలకు దిగుతోందని, ఈ క్రమంలోనే ఆమెకు పోలీసులు బ్రీత్ టెస్ట్ చేశారు.

Tags:    

Similar News