DOST : దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్

డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్‌ను కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన బుధవారం రిలీజ్ చేశారు.

Update: 2024-07-25 01:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్‌ను కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన బుధవారం రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. కాగా వచ్చేనెల 2వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. దివ్యాంగులకు ఆగస్టు 2వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఆగస్టు 6న సీట్లను కేటాయించనున్నారు.

వచ్చేనెల 7 నుంచి 9వ తేదీ వరకు సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం, యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్ కల్చర్ సంయుక్తంగా నాలుగేళ్ల బీబీఏ కోర్సులో ప్రవేశాలను దోస్త్ నుంచి భర్తీ చేయనున్నారు. బీబీఏలో భాగంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్(ఎన్ఐటీహెచ్ఎం) కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విద్యార్థులకు భవిష్యత్ లో మంచి ప్లేస్ మెంట్లు ఉంటాయని దేవసేన పేర్కొన్నారు.


Similar News