‘ఇదేమైనా నీ అత్తారిల్లు అనుకున్నావా’... గర్భిణీతో దురుసు ప్రవర్తన

ఏడు నెలల గర్భిణీ ట్రీట్ మెంట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే... అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.

Update: 2023-05-12 03:05 GMT

దిశ, మానవపాడు : ఏడు నెలల గర్భిణీ ట్రీట్ మెంట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే... అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది మహిళతో దురుసుగా ప్రవర్తించారు. మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఏంటి.. మీ అత్తారిల్లు కాదని దురుసుగా ప్రవర్తించిన సంఘటన మానవపాడు ప్రాథమిక ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రికి వెళ్లడానికి సమయం సందర్భం ఉండదు. కానీ ఈ సమయంలో ఎందుకు వచ్చావు అని దురుసుగా మాట్లాడేమే కాక ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని ఆసుపత్రి డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ మాట్లాడిన తీరు గర్భిణి కుటుంబ సభ్యులు ఆగ్రహం తెప్పించింది. నిర్లక్ష్యంగా మాట్లాడటం.. గర్భిణీతో దురుసుగా ప్రవర్తించడం సమంజసం కాదని ఆమె తీరుపై జిల్లా కలెక్టర్‌కు డిఎంహెచ్‌వో ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మనోపాడు గ్రామానికి చెందిన ఆరిఫా ఏడు నెలల నిండుగర్భిణి. ట్రీట్‌మెంట్ కోసం భర్త రహీమ్‌తో పాటు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. ఏ సమయంలో అంటే ఆ సమయంలో రావడానికి ఇది మీ అత్తారిల్లు అనుకున్నావా... రేపు వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని... అంతలోపు ఏమి చావవులే అని ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది దురుసుగా మాట్లాడి ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోమన్నారు. ఈ విషయం మీడియాకు తెలవడంతో మానవపాడు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం బయటికి పొక్కింది. ఆమె పని తీరుపై శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. దురుసుగా మాట్లాడిన సిబ్బందిపై వెంటనే సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలని లేదంటే ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News