'మోడీ ప్రధానిగా ఉంటే పాకిస్తాన్ ఆటలు సాగవు'
ప్రధానిగా మోడీ ఉంటే పాకిస్తాన్ ఆటలు సాగవని, అందుకే ఆయనపై ఆ దేశం విమర్శలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానిగా మోడీ ఉంటే పాకిస్తాన్ ఆటలు సాగవని, అందుకే ఆయనపై ఆ దేశం విమర్శలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రధానిపై పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. గుజరాత్ అల్లర్ల తరువాత నరేంద్ర మోడీని రావదన్న అమెరికా, మోడీ ప్రధాని అయిన తరువాత ఆయన్ను ఏ విధంగా స్వాగతం పలికారో పాకిస్తాన్ మంత్రి మర్చిపోయినట్లున్నారని డీకే అరుణ చురకలంటించారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ఒక్క విపక్ష నాయకుడూ ఖండించకపోవడం సిగ్గుమాలిన చర్యని డీకే అరుణ ధ్వజమెత్తారు. పాక్ మంత్రి వెంటనే ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని, లేదంటే సరైన సమయంలో గుణపాఠం చెబుతామని డీకే అరుణ హెచ్చరించారు.