తెలంగాణ నిరుద్యోగులు ఈ కుంభకోణాన్ని గమనించారా..? బీఆర్ఎస్ నేత సంచలన వీడియో
రాజీవ్ యువ వికాసం కాంగ్రెస్ కార్యకర్తలకేనా?, తెలంగాణ నిరుద్యోగులారా ఈ కుంభకోణాన్ని గమనించండి అని బీఆర్ఎస్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాజీవ్ యువ వికాసం కాంగ్రెస్ కార్యకర్తలకేనా?, తెలంగాణ నిరుద్యోగులారా ఈ కుంభకోణాన్ని గమనించండి అని బీఆర్ఎస్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం (Rajiv Yuva Vikas Scheme)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ (RSP).. ఇంత విచ్చలవిడిగా దోపిడా? అని రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే రాజీవ్ యువ వికాసం అంటే ‘మన’ కాంగ్రెస్ కార్యకర్తలకు (Congress Activists) చేయూత పథకం అన్నమాట! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అంతేగాక ఈ మార్గదర్శకాలు, ఆన్లైన్ అప్లికేషన్ అన్నీ కేవలం అమాయక ప్రజలను మభ్యపెట్టే డ్రామాలు మాత్రమేనని, తెలంగాణ నిరుద్యోగులందరూ ఈ కుంభకోణాన్ని (Scam) గమనించాల్సిందిగా కోరుతున్నానని మాజీ ఐపీఎస్ అధికారి రాసుకొచ్చారు. కాగా తెలంగాణలోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు 60 నుంచి 80 శాతం సబ్సీడీతో లక్ష నుంచి మొదలుకొని 4 లక్షల వరకు రుణాలు ఇప్పించి, స్వయం ఉపాధి కల్పించనున్నారు. ఈ ఫథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 4 వరకు ఈ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.