పండగ పూట తీవ్ర విషాదం.. ప్రాణాలు పణంగా పెట్టిన దక్కని కుమారుడు

పోచంపాడు గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది.

Update: 2024-03-09 06:59 GMT

దిశ, బాల్కొండ : పోచంపాడు గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మెండోరా మండలం పోచంపాడులో గోదావరి నదిలో పుణ్య స్నానాలకు కుంటుంబం వచ్చింది. వారిలో కొడుకు, మేనల్లుడు ప్రమాదవశాత్తు నీటిలో మునగగా.. తండ్రి మేనల్లుడిని ఓడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. కానీ తన కొడుకును మాత్రం కాపాడుకోలేకపోయాడు. మాక్లూర్ మండలం అడివి మామిడిపల్లి గుత్ప ఎక్స్ రోడ్ నుండి బాధిత కుటుంబం వచ్చి మొదట గోదావరిలో పుణ్య స్నానాలు చేసి దర్శనం చేసుకుందామని భావించారు. అయితే గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు తండ్రి మక్కల్ రెడ్డి, కొడుకు మక్కల మహేష్, దండగుల బాలయ్య, కొడుకు దండుగుల శ్రీనివాస్ నీటిలో దిగారు. అయితే ఒక్క సారిగా నీటి ప్రవాహానికి కొడుకు, మేనల్లుడు కొట్టుకొని పోయారు. ఇది గమనించిన తండ్రి మక్కల్ రెడ్డి కొడుకు మేనల్లుడు ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో మేనల్లుడు దండుగల శ్రీనివాస్‌ను కాపాడాడు. కొడుకు మక్కల మహేష్ మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.


Similar News