కాంగ్రెస్‌లో చేరబోయే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే.. లిస్ట్ లీక్ చేసిన దానం నాగేందర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిగ్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోయే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్లే అంటూ వారి పేర్ల జాబితాను లీక్ చేశారు.

Update: 2024-06-21 08:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిగ్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోయే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్లే అంటూ వారి పేర్ల జాబితాను లీక్ చేశారు. శుక్రవారం శాసనసభ మాజీ స్పీకర్, బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో దానం గాంధీ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీ కొంపముంచిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌తోపాటు ఎమ్మెల్యేలు అయోమయంలో పడి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 20 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలోనే హస్తం పార్టీలోకి వస్తారని దానం అన్నారు. మల్లారెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కొత్త ప్రభాకర్, కేవీ వివేకానంద, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని వారి పేర్లను రివిల్ చేశారు. హరీశ్ రావుతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


Similar News