45 మంది ప్రాణాలు కాపాడి చనిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్
బస్సులో ఉన్న 45 మందిని క్షేమంగా ఉంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన గజ్వేల్ వద్ద చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: బస్సులో ఉన్న 45 మందిని క్షేమంగా ఉంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన గజ్వేల్ వద్ద చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ వద్ద హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు డ్రైవర్‌కు గుండెపోటుతో మృతి చెందాడు. ఆ బస్సు హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. డ్రైవర్‌కు ఛాతిలో నొప్పిగా ఉండటంతో బస్సును పక్కకు నిలిపి.. ప్రయాణికులకు చెప్పాడు. దీంతో డ్రైవర్ రమేష్ సింగ్‌ను ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే బస్సులో 45 మంది ప్రాణాలు కాపాడి చనిపోయిన డ్రైవర్ రమేష్ సింగ్ మృతి చెందాడని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.