పాతబస్తీలో మొసలి కలకలం

హైదరాబాద్(Hyderabad) నగరంలోని పాతబస్తీలో జనావాసాల మధ్య మొసలి ప్రత్యక్షమవడం సంచలనం సృష్టించింది.

Update: 2024-09-25 12:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలోని పాతబస్తీలో జనావాసాల మధ్య మొసలి ప్రత్యక్షమవడం సంచలనం సృష్టించింది. పాతబస్తీలోని బహుదూర్ పురాలో ఇళ్లమధ్య గల నాలాలో భారీ మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని, మొసలి సమాచారాన్ని పక్కనే గల జవహర్ లాల్ నెహ్రూ జూపార్కు(ZooPark) అధికారులకు తెలిపారు. హుటాహుటిన మొసలి ఉన్న ప్రదేశానికి చేరుకున్న జూ సిబ్బంది చాకచక్యంగా దానిని బంధించి జూకు తరలించారు. కాగా నాలాలో మొసలి ఉందన్న వార్త దావనంలా వ్యాపించడంతో దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. 


Similar News