ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయల విరాళం అందించిన కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్

సెప్టెంబర్ నెల మొదట్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణతో పాటు ఏపీలో భారీ వరదలు వచ్చాయి.

Update: 2024-09-25 14:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ నెల మొదట్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణతో పాటు ఏపీలో భారీ వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో వేలాది సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ వరదల కారణంగా భారీ నష్టం ఏర్పడగా.. వారిని ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి. భాస్కర్ రావు కోటి రూపాయలు ప్రకటించారు. కాగా ఈ రోజు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి. భాస్కర్ రావును ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు.


Similar News