పోలీసుల తీరు విచారకరం.. కేసీఆర్‌కు చాడ వెంకట్ రెడ్డి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా బొల్లికుంట శివారులోని గుడిసెవాసులపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా బొల్లికుంట శివారులోని గుడిసెవాసులపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గుడిసెలు ఖాళీ చేయాలంటూ పేదలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతూ మంగళవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఏడాది క్రితం బొల్లికుంటలోని ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలు ఆక్రమించే ప్రయత్నం చేస్తే సీపీఐ గుర్తించి పేదలతో దాదాపు 2000 గుడిసెలు వేయించిందని గుర్తుచేశారు. వారందరికీ ఇండ్ల స్థలాల సర్టిఫికేట్స్ ఇచ్చి పక్కా ఇండ్లు కట్టించాలని కలెక్టర్, అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన స్పందన రాలేదని, ఆగస్టు 29 అర్ధరాత్రి పోలీసులు గుడిసెవాసులపై లాఠీ చార్జి చేసి వ్యాన్లలో తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.