సీపీఐ సంచలన నిర్ణయం.. కేసీఆర్పై పోటీకి కీలక నేత
ఇటీవల ప్రకటించిన తొలి జాబితాతో కమ్యూనిస్టు పార్టీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: ఇటీవల ప్రకటించిన తొలి జాబితాతో కమ్యూనిస్టు పార్టీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పొత్తులు లేవని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. దీంతో సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కూనం నేని మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై పోటీ చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. కారుపార్టీ మిత్రద్రోహం చేసిందన్నారు. ఇండియా కూటమి మీటింగ్కు వెళ్లి మేం తప్పు చేశామని బీఆర్ఎస్ అంటోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో చాలా ఏళ్లు పనిచేశామన్నారు. ఎక్కడ పోటీ చేయాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయింస్తుందని తెలిపారు.