CPI Narayana: తొక్కిసలాట ఘటనలో పోలీసుల తప్పు లేదు.. సీపీఐ నారాయణ సెన్సేషనల్ కామెంట్స్

సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాట ఘటనలో పోలీసుల తప్పు లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ (CPI National General Secretary Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-22 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాట ఘటనలో పోలీసుల తప్పు లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ (CPI National General Secretary Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి ఘటనకు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లను పెంచాడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇక నుంచి సందేశాత్మక, చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలకు మాత్రమే రాయితీలు, టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పుష్ప-2 (Pushpa-2) సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌ను హీరోగా చూపించడం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి సినిమాకు ప్రజలపై భారం మోపుతూ టికెట్లను రేట్లను పెంచిన తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మొదటి మద్దాయి అని ఫైర్ అయ్యారు. ఇందులో పోలీసుల తప్పు ఏమి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలకు వేలు ఖర్చు పెట్టినా ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి సినిమా చేడలేని పరిస్థితి ఉందని నారాయణ అన్నారు. 

Tags:    

Similar News