బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను: ఎమ్మెల్యే రాజాసింగ్

మంగళవారం తెలంగాణ బీజేపీ కార్యాలయం(Telangana BJP office)పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ప్రకటించారు.

Update: 2025-01-07 09:10 GMT

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం తెలంగాణ బీజేపీ కార్యాలయం(Telangana BJP office)పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ప్రకటించారు. ప్రస్తుతం కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన రాజాసింగ్ వార్తల్లో బీజేపీ కార్యాలయంపై దాడి వార్తలను చూసి ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఇటువంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని, కాంగ్రెస్(Congress) నాయకత్వం యొక్క నిరాశను ఎత్తి చూపుతున్నాయని అన్నారు. ఈ సిగ్గుమాలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేషరతుగా క్షమాపణలు(Apologies) చెప్పాలని డిమాండ్(demand) చేశారు.

కాంగ్రెస్ వ్యూహాలకు బీజేపీ బెదరదు అని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటే బీజేపీ(BJP) కూడా దీటుగా తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్(Warning) ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయం ముట్టడించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ కార్యాలయం లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ ఆఫీసుపై కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేయగా ఇద్దరు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి.


Similar News