TG High Court: కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్
ఏసీబీ (ACB) విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ (ACB) విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ (ACB) విచారణలో కేటీఆర్ వెంట న్యాయవాది కలిసి కూర్చునేందుకు అనుమతించే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ (ACB) కార్యాలయంలో కేటీఆర్‌కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతిస్తామని తెలిపింది. అదేవిధంగా ముగ్గురు లాయర్ల పేర్లు కూడా ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాదికి సూచించింది. ఈ మేరకు ముగ్గురు లాయర్ల పేర్లను ఇవ్వాలని కేటీఆర్ (KTR) తరఫు న్యాయవాదికి సూచించింది. అంతకు ముందు విచారణను న్యాయవాది చూసే అవకాశం ఏసీబీ నియమ నిబంధనల్లో ఉందా అని కోర్టు అధికారులను ప్రశ్నించింది. అందుకు వారు లేదని సమాధానం ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.