BRS: హమీలు అడిగినందుకు అక్రమ కేసులు.. హరీష్ రావు సంచలన ఆరోపణలు
కాంగ్రెస్(Congress) ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. అడిగినందుకు అక్రమ కేసులు(False cases) పెడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు(BRS Leader Harish Rao) విమర్శించారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్(Congress) ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. అడిగినందుకు అక్రమ కేసులు(False cases) పెడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు(BRS Leader Harish Rao) విమర్శించారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్(BRS Calendar) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచాయని, ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలు డైరీలో ఉన్నాయని అన్నారు.
అలాగే నేటి డైరీ ఆవిష్కరణ బీఆర్ఎస్ పార్టీ(BRS Party)ని తిరిగి అధికారంలోకి తేవడానికి ఉపయోగపడాలని సూచించారు. కేసీఆర్(KCR) సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టారని, దీనిపై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు తనపై కేసు పెట్టారని ఆరోపణలు చేశారు. అలాగే కేటీఆర్ పై కేసు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics) చేస్తున్నారని, అల్లు అర్జున్ ఎపిసోడ్, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ లోగో పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతేగాక రేవంత్ రెడ్డి రైతుబంధును ఎగ్గొట్టారని, గతంలో పెళ్లికి వచ్చే కల్యాణ లక్ష్మీ ఇప్పుడు పిల్లలు పుట్టాక వస్తుందని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పింఛన్ పెంచుతా అని ఎగ్గొట్టారని, పక్క రాష్ట్రం ఏపీలో ఇచ్చిన మాట ప్రకారం 4వేల పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. బడా కాంట్రాక్టర్లు, ఢిల్లీకి మూటలు పంపడానికి పైసలు ఉన్నాయి కానీ, సంక్షేమ పథకాలకు పైసలు లేవా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి అప్పులు అని అసత్య ప్రచారాలు చేస్తే.. అప్పులపై అసెంబ్లీలో కాంగ్రెస్ నోరు మూయించామని గుర్తు చేశారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 40 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని, కానీ కాంగ్రెస్ ఏడాదికి లక్షా 40 వేల కోట్లు అప్పు చేసిందని అన్నారు. లగచర్ల గిరిజన రైతులకు అండగా కేటీఆర్ నిలబడ్డారని, కేటీఆర్ కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా నిలబడుతుందని, రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే కేటీఆర్ పై కేసు పెట్టారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.