HYD: ముగిసిన ఓబుళాపురం గనుల కేసు విచారణ.. మే 6న తీర్పు
ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో ముగిసింది..

దిశ, వెబ్ డెస్క్: ఓబుళాపురం మైనింగ్ కేసు(Obulapuram mining case) విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టు(Hyderabad CBI Court)లో శుక్రవారం జరిగింది. ఈ కేసు విచారణ సుధీర్ఘకాలం జరిగింది. ఈ రోజుతో ఎట్టకేలకు కేసు విచారణ ముగిసింది. మే 6న తుది తీర్పు ఇవ్వనున్నట్లు ధర్మాసనం తెలిపింది. కాగా ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy)తో పాటు, బీవీ శ్రీనివాసరెడ్డి(B.V. Srinivasa Reddy), తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) నిందితులుగా ఉన్నారు. 2009 డిసెంబర్‌లో ఈ కేసు నమోదు అయింది. ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి 219 మంది సాక్షులను సీబీఐ విచారించింది. 3337 డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంది. 9 మంది నిందితులపై నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.