MP DK. Aruna : నా కూతురు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే పుట్టింది : ఎంపీ డీ.కే. అరుణ

ప్రభుత్వ ఆసుపత్రుల(Government Hospitals)ను మరింత అభివృద్ధి(Development)చేయాల్సిన అవసరముందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి డీ.కే.అరుణ(MP DK. Aruna) అన్నారు.

Update: 2025-01-08 10:01 GMT
MP DK. Aruna : నా కూతురు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే పుట్టింది : ఎంపీ డీ.కే. అరుణ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఆసుపత్రుల(Government Hospitals)ను మరింత అభివృద్ధి(Development)చేయాల్సిన అవసరముందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి డీ.కే.అరుణ(MP DK. Aruna) అన్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ కీలక‌ సమావేశానని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర, వైద్యాధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ నా కూతురు(My Daughter) కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే పుట్టింద(Born In A Government Hospital)ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ ఇదే పెద్దాస్పత్రి అని పేర్కొన్నారు.

అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మాణం జరుగుతోందని..ఆసుపత్రిలో ప్రస్తుత వసతులు బాగానే ఉన్నప్పటికి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం మా ఎంపీ, ఎమ్మెల్యేల ఫండ్స్ సరిపోవని, అందుకే నేను ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధుల మంజూరుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆస్పత్రికి అవసరమైన సొలార్ లైట్స్, ఒక అంబులెన్స్ ఇచ్చే బాధ్యత నాదన్నారు.

ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని నేను ఆశిస్తున్నట్లుగా తెలిపారు.వచ్చే నాలుగేళ్లలో ఈ ఆస్పత్రిని ది బెస్ట్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఆస్పత్రుల అధునీకరణ, ఇతర అభివృద్ది పనుల కోసం భారీగా నిధుల మంజూరు చేస్తున్నారని అరుణ గుర్తు చేశారు. 

Tags:    

Similar News