దళితులతో కాంగ్రెస్ రాజకీయ చెలగాటం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి
దళితులతో కాంగ్రెస్ రాజకీయ చెలగాటం అడుతోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : దళితులతో కాంగ్రెస్ రాజకీయ చెలగాటం అడుతోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. దళితబంధును రూ.12 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని, రాజకీయాల్లో ఇది సహజం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదన్నారు. కేటీఆర్, హరీష్రావు కృష్ణార్జునులని, వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని సూచించారు.