కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం చేస్తోంది : మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ అన్నారు.

Update: 2024-09-03 17:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వరద బాధితులకు సహాయం చేద్దామని వెళ్తే రాళ్లతో దాడులు చేశారని, రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్ధం కావడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లు ఎవరు భయపడరని, దాడులు చేసి బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేయాలనుకుంటే కాంగ్రెస్ నేతల తరం కాదన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తే ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని, హైదరాబాద్ లోనూ ఎలాంటి ఘర్షణలు లేకుండా పదేళ్లు బీఆర్ఎస్ పరిపాలన చేసిందన్నారు. దాడులతో సమయాన్ని వృధా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం చేస్తోందని ఆరోపించారు. పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు ప్రతీకారపాలన సాగుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన ఎన్నికల ప్రచారంలాగా ఉందని దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎంపీ బాల్కసుమన్, నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, దాసోజు శ్రవణ్, మన్నెగోవర్దన్ రెడ్డి పాల్గొన్నారు. 


Similar News