కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై MIM నేతల దాడి

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సోమవారం నియోజకవర్గంలోని అసిఫ్‌నగర్‌లో సీసీ రోడ్ల పరిశీలన

Update: 2024-10-07 12:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సోమవారం నియోజకవర్గంలోని అసిఫ్‌నగర్‌లో సీసీ రోడ్ల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్(Congress leader Feroz Khan) వెళ్లారు. స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్(MIM MLA Majid Hussain) అనుచరులు ఫిరోజ్ ఖాన్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఎంఐఎం నేతలు ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేశారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో మాజిద్ హుస్సేన్‌పై స్వల్ప తేడాతో ఫిరోజ్ ఖాన్ ఓటమి చెందారు. చివరి వరకూ ఉత్కంఠంగా సాగినా.. 1500 ఓట్ల తేడాతో మాజిద్ హుస్సేన్ గెలుపొందారు.


Similar News