SLBC : 30 నెలల్లో సొరంగాన్ని పూర్తి చేస్తాం.. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక హామీ

రాబోయే 30 నెలల్లో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు సొరంగాన్ని పూర్తి చేస్తామన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Update: 2024-10-07 14:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే 30 నెలల్లో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు సొరంగాన్ని పూర్తి చేస్తామన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానంగా మార్కెట్ కమిటీ పనిచేయాలి రైతులకు మార్కెట్‌లో ఏ చిన్న సమస్య లేకుండా కృషి చేస్తే రైతులు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి.. నల్గొండ జిల్లా రైతులకు సాగునీళ్లు అందించడమే తన ఆశయమన్నారు. మూసీని ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాను కాలుష్యం కోరల్లోంచి రక్షిస్తామన్నారు. అదేవిధంగా

వెంకటేశ్వర నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని రైతన్నలకు రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. రూ. 2 లక్షలకు పెగా లోన్లు ఉన్న రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేయబోతున్నామని గుడ్ న్యూస్ చెప్పారు. నూతనంగా ఎన్నుకోబడిన పాలకమండలి సభ్యులందరూ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూడాలి అది మీ బాధ్యత అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యులకు సూచించారు.


Similar News