HYDRA: ఆక్రమణలపై ఇక క్షణాల్లో ‘హైడ్రా’కు సమాచారం.. కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

ఓఆర్ఆర్ (ORR) పరిధిలో చెరువుల ఆక్రమణలు గుర్తిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRA Commissioner Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-07 14:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓఆర్ఆర్ (ORR) పరిధిలో చెరువుల ఆక్రమణలు గుర్తిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRA Commissioner Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ (Lake Protection Committe)తో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. అదేవిధంగా ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ల (Buffer Zone) గుర్తింపునకు చర్యలు చేపట్టనున్నారు. చెరువుల ఆక్రమణలకు అస్కారం లేకుండా ప్రత్యేకంగా ఓ యాప్‌ను తీసుకురావాలని నిర్ణయించారు.

ఎక్కడ ఆక్రమణలు జరిగినా.. క్షణాల్లో ‘హైడ్రా’ (HYDRA)కు తెలిసేలా వ్యవస్థను రూపొందించనున్నారు. ఆక్రమణల తొలగింపు తరువాత వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్ల చెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRA Commissioner Ranganath) మాట్లాడుతూ.. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఆక్రమణపై గుర్తిస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెరువుల పరిశీలనలో ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేస్తామని రంగనాథ్ (Ranganath) స్పష్టం చేశారు.

కాగా, తాజాగా ప్రభుత్వం(Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అందుకు సంబంధించి ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌ (Greater Hyderabad) పరిధిలోని చెరువుల విస్తీర్ణంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సర్వే పూర్తయిన వెంటనే డేటాను డిజిటలైజ్ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని సూచించింది.


Similar News