అందరినీ కలుపుకొని పోవడమే "అలయ్-బలయ్" ఉద్దేశం : బండారు దత్తాత్రేయ

Update: 2024-10-07 13:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : అన్ని పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చి, ఆయా పార్టీల నాయకులను కలుపుకొని పోవడమే 'అలయ్-బలయ్'(Alai-Balai) కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు హర్యానా గవర్నర్, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ప్రతియేటా దసరా సందర్భంగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి 19 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విడివిడిగా ఉన్న అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చి, ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళే ఉద్దేశంతో అలయ్-బలయ్ కి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. ఎలాంటి బేధాలు లేకుండా అందరూ కలుసుకునే ఆత్మీయ సమ్మేళనం ఇదని, అలాగే తెలంగాణ సాంస్కృతిని, సాంప్రదాయాలను, ఆహారపు అలవాట్లను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అలయ్-బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అన్ని పార్టీల ప్రముఖ లీడర్లకు ఆహ్వానాలు పంపామని తెలియ జేశారు. ఈ ఏడాది అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. 


Similar News