Congress: మామను ఇరికించేందుకే హరీష్ రావు సిట్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
మామ, బామ్మర్థిని ఇరికించేందుకే అసెంబ్లీ వేదికగా హరీష్ రావు(BRS Leader Harish Rao) సిట్(SIT) కోరారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy venkat Reddy) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: మామ, బామ్మర్థిని ఇరికించేందుకే అసెంబ్లీ వేదికగా హరీష్ రావు(BRS Leader Harish Rao) సిట్(SIT) కోరారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy venkat Reddy) అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు(RRR) మంజూరుపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్(ORR) టోల్‌లీజ్(Toll Lease) పై సిట్ వేయాలని హరీష్ రావు కోరారని, ఆయన అసెంబ్లీలో అడిగినందుకే సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేగాక ఓఆర్ఆర్ టోల్ లీజ్ విషయంలో తన మామ, బామ్మర్ధిని ఇరికించేందుకే హరీష్ రావు సిట్ కోరారని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఓఆర్ఆర్ టోల్‌గేట్ లీజ్‌పై విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Race) దొంగలు దొరికారని, త్వరలోనే ఓఆర్ఆర్ టోల్ లీజ్(ORR Toll Lease) అవకతవకలు కూడా బయటపడతాయని చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ కోసం ఢిల్లీలో ఉండి ఎంతో కృషి చేశానని, 2017 లో ఆగిపోయిన ప్రాజెక్టు మా కృషి వల్ల ముందడుగు పడిందని తెలిపారు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ మంజూరు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అంతేగాక దీనికి సహకరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు.