MLC Kavitha : బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్ : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) బీసీ(BC)లకు ఇచ్చిన హామీల(Promises)ను విస్మరించి(Ignored) అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)మండిపడ్డారు.

Update: 2025-01-01 11:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) బీసీ(BC)లకు ఇచ్చిన హామీల(Promises)ను విస్మరించి(Ignored) అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)మండిపడ్డారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 3వ తేదీన నిర్వహించనున్న బీసీ మహాసభ (BC Mahasabha) పోస్టర్‌ను బుధవారం కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరించుకొని బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టిందన్నారు. బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు.

ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్ధతు ప్రకటించాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, బీసీ సంఘాల నాయకులు బొల్లా శివశంకర్, పెంట రాజేష్, సుంకోజు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి, కుమారస్వామి, విజేందర్ సాగర్, రాచమల్ల బాలకృష్ణ, కోళ్ల శ్రీనివాస్, సాల్వా చారి, మురళి, నిమ్మల వీరన్న, లింగం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read..

KTR vs Kavitha: బీఆర్ఎస్ లో కవిత వర్సెస్ కేటీఆర్!.. న్యూ ఇయర్ తొలి రోజే పార్టీలో హాట్ టాపిక్ 

Tags:    

Similar News